Listen to this article

జనం న్యూస్ : 23 జనవరి శుక్రవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ ;

సిద్దిపేట పట్టణం భారత్ నగర్ శ్రీవాణి స్కూల్లో వసంత పంచమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాదేవి సరస్వతి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ప్రత్యేకంగా పూజించారు.కార్యక్రమంలో భాగంగా ముందుగా గణపతి పూజ, సరస్వతి పూజ,అక్షరాభ్యాసం పాటు కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం 15 మంది చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించగా, సుమారు 40 మంది మహిళలు కుంకుమార్చనలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు, పలక–బలపాలు పంపిణీ చేసి విద్యపై ఆసక్తిని పెంపొందించారు. చివరగా తీర్థ ప్రసాదాలను అందరికీ అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సి.హెచ్. సత్యం మాట్లాడుతూ, వసంత పంచమి విద్య, జ్ఞానం, సద్గుణాలకు ప్రతీక అని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు సంస్కారవంతులుగా ఎదగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.