Listen to this article

జనం న్యూస్ ;23 జనవరి శుక్రవారం;సిద్దిపేట నియోజికవర్గం ఇన్చార్జి వై.రమేష్ :

సిద్దిపేట పట్టణం భారత్‌నగర్‌లోని వివేకానంద విద్యాలయంలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా విద్యాదేవి సరస్వతి పూజ నిర్వహించారు.
అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ యాళ్లా భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నాగేందర్ పంతులుచే చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ లిఖిత, ఉపాధ్యాయులు వాణీశ్రీ, రత్నమాల, కావేరి, దేవిక, భరతమాత, సారిక, ఫిర్డోజ్ భారతి, మానుష, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.