మూడు రోజుల పాటు ఉత్సవాలనిర్వహణ
జుక్కల్ జనవరి 23:- జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కౌలాస్ గ్రామంలో బస్వలింగ శివాచార్య మఠసంస్థానం లో మూడు రోజుల పాటు జరిగే వసంత పంచమి, రథ సప్తమి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.శుక్రవారం మఠదీపతి శ్రీ బస్వలింగ శివాచార్య మహారాజ్ అద్వర్యం లోద్వజారోహన చేసివేడుకలు ప్రారంభించారు.దేవతారదన, గణపతి పుణ్యహవచనం, మహారుద్ర హోమం చేసి వసంత పంచమి వేడుకలు నిర్వహించారు.ఈసందర్బంగా మహారాజ్ మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన మఠం భవనం ప్రారంభోత్సవంతో పాటు శనివారం ఆదివారం భక్తులకు గురుదీక్ష, శివాదీక్ష,కార్యక్రమాలు జరుగుతాయి.ఆదివారం రాత్రి పలువురు పిఠాధిపతుల ఆధ్వర్యంలో ధర్మసభ జరుగుతుంది. సంప్రదాయ భజనలు,కీర్తనలు,సోమవారం తెల్లవారుజామున రాథోత్సవం, అగ్ని గుండం కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ద్వాజారోహన కార్యక్రమం లో మాటాదిపతి బస్వలింగ శివాచర్య మహారాజ్ తో పాటు సర్పంచ్ ఎంబరి విద్యా బలరాం గ్రామ నాయకులు అనిత సింగ్ విట్టల్ పటేల్,ఉమాకాంత్ దేశాయ్,గొల్ల హన్మాండ్లు, వీరేష్ పటేల్, ప్రకాష్ పటేల్, విశ్వనాధ్ కాలే నారాయణ,బోడ సాయిలు, పాకలి వెంకటి,సంతుపటేల్ హన్మగౌడ్,గంగారెడ్డి, మల్లప్ప తదితరులు పాల్గొన్నారు.



