Listen to this article

జనం న్యూస్ జనవరి 23: నిజామాబాద్ జిల్లా

ఏర్గట్లమండలకేంద్రంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయం లో జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ మరియు కార్యాలయ సిబ్బంది, స్థానికులతో కలిసి ఓటర్ల ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి పౌరుడికి లభించిన అత్యంత విలువైన హక్కు. ఈ హక్కును బాధ్యతాయుతంగా, భయభ్రాంతులు లేకుండా వినియోగించినప్పుడే బలమైన ప్రజాస్వామ్యం సాధ్యమవుతుంది.18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకొని, ప్రతి ఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించాలి. యువత ఓటింగ్ ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలి. ఓటు మన హక్కు మాత్రమే కాదు, మన బాధ్యత కూడా.
ఈ సందర్భంగా నిష్పక్షపాతంగా, నిజాయితీతో ఓటు వేయాలని ప్రతిజ్ఞ చేద్దాం. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, దేశ అభివృద్ధికి మన వంతు పాత్రను పోషిద్దాం అని అన్నారు. గుమ్మిర్యాల్ జిల్లా పరిషత్ పాఠశాలలో మండల విద్యాధికారి, ఉపాధ్యాయులు మరియు విద్యార్థినీ–విద్యార్థులతో కలిసి ఓటర్ల ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.మండలంలోని వివిధ పాఠశాలలలో ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు విద్యార్థినీ–విద్యార్థులచే ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు.