జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 23
తర్లుపాడు మండలంలోని తాడివారిపల్లి మరియు తర్లుపాడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువ, ప్రతి పౌరుడు నిర్భయంగా మరియు స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరాన్ని ఎమ్మార్వో కే. కిషోర్ కుమార్ విద్యార్థులకు వివరించారు.అనంతరం విద్యార్థులతో ఓటర్ల ప్రతిజ్ఞ చేయించి, మతం, కులం, వర్గం, భాష వంటి భేదాలకు లోనుకాకుండా స్వేచ్ఛాయుతంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తు ఓటర్లుగా విద్యార్థులు బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఐ శ్రీ చరణ్, ఎలక్షన్ సూపర్వైజర్ లక్ష్మీరెడ్డి, ఎలక్షన్ ఆపరేటర్ విష్ణు, టైపిస్టు ఆదినారాయణ, కంప్యూటర్ ఆపరేటర్ నాగరాజు, బిఎల్వోలు చెన్నయ్య, రసూల్, రాజేశ్వరి, దుర్గ భవాని, తదితరులు పాల్గొన్నారు.



