బిజెపి బూత్ ప్రెసిడెంట్ యోగేశ్వర్ గంగాపురే,
జనం న్యూస్,జనవరి 23,కంగ్టి,
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని పీఎం దామరగిద్దలో శుక్రవారం వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలోని పిల్లలకు పుస్తకాలు,పెన్నులు, పెన్సిల్లను దామరగిద్ద పంచమహల్ గ్రామ బీజేపీ బూత్ ప్రెసిడెంట్ గంగాపురే యోగేశ్వర్ పాటిల్,విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వసంత పంచమి మాఘ శుద్ధ పంచమి నాడు జరుపబడును.దీనిని శ్రీ పంచమి అని మదన పంచమి అని కూడా అంటారు.మాఘశుద్ధ పంచమి సరస్వతీదేవి జన్మించిన రోజు,ఈ పండుగ యావత్ భారతదేశంలో విశేషముగా జరుపుకుంటారని అన్నారు.ఈ రోజు సరస్వతి దేవికి పూజ చేయవలెను.రతీ మన్మథులను పూజించి మహోత్సవ మొనరించవలెనని, దానములు చేయవలెనని,దీని వలన మాధవుడు (వసంతుడు) సంతోషించునని నిర్ణయామృతకారుడు తెలిపెను అని అన్నారు. దీనిని వసంతోత్సవము అని కూడా అంటారు. “మాఘ శుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమగును. ఈనాడు విష్ణువును పూజింపవలెను.చైత్ర శుద్ధ పంచమి నాడు వలెనే బ్రాహ్మణులకు సంతర్పణ చేయవలెను” అని వ్రత చూడామణిలో పేర్కొనబడిందని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రతాప్ రెడ్డి, ఉపాధ్యాయులు,గ్రామ పెద్దలు సంధ సాయిలు, పద్మశాలి సిద్దు,మారుతి పాటిల్,సంధ శ్రీను, అంబు పాటిల్, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


