Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 7 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి : ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ఎన్టీఆర్ నగర్ లో స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ నిర్మించిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం నాల్గోవ వార్షికోత్సవం సందర్భంగా కార్పొరేటర్ మరియు యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ పాలాభిషేకము, దివ్య అలంకరణ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం భక్తులకు అన్నసమరాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ముఖ్యాతిధిలుగా ఎమ్మెల్యేలు అరేకపూడి గాంధీ మరియు మాధవరం కృష్ణారావు వడ్డేపల్లి రాజేశ్వరరావు కార్పొరేటర్లు మాధవరం రంగారావు మరియు జూపల్లి సత్యనారాయణ గొట్టిముక్కల వెంగళరావు సురభి రవీందర్ రావు మాధవరం రాజేశ్వరరావు మరియు నాయకులు కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, ఆలయ సిబ్బంది, సాయిబాబా భక్తులు, స్థానిక వాసులు తదితరులు పాల్గొన్నారు.