Listen to this article

జనం న్యూస్, జనవరి 11, బోధన్ నియోజవర్గం బోధన్ మహాలక్ష్మి అనే మహిళ బోధన్ బస్టాండ్ లో గురువారం సాయంత్రం 6:30 సమయంలో బస్సు కోసం చూస్తున్న సమయంలో 11 సంవత్సరాల ఒంటరి బాలికను గమనించడం జరిగింది. మహాలక్ష్మి పిలుపు మేరకు మేము పద్మా సింగ్ (పి ఎల్ వి ), రమణా రెడ్డి ( పి ఎల్ వి), మరియు స్వరూప (అంగన్వాడీ టీచర్) సిబ్బందితో బస్టాండ్ కు రావడం జరిగిందని,బాలిక గురించి ఆరా తీయగా తన పేరు సాయమ్మ ( సావిత్రి ) అని, బాలిక తండ్రి పేరు పోశెట్టి అని, వీరి ఊరు కోటగిరి అని, బాలిక తల్లి చనిపోయిన తర్వాత నాన్న మరో పెళ్లి చేసుకోవడం జరిగిందని,తండ్రి మానసిక రుగ్మత వల్ల ఎక్కడ వెళ్ళాడో తెలియదని , తన పిన్ని తనను హింసిస్తూ , బాధపెడుతూ, డబ్బులు కోసం అడుక్కుని రమ్మని ఆదేశించేదని, బాలిక మాట్లాడుతూ పిన్ని ఇంటి నుంచి పంపించేసిందని , ఇరుగు పొరుగువారు బోధన్ ఆర్టీసీ బస్సు ఎక్కించడం జరిగిందని,వెంటనే కలిసి బాలికను బోధన్ లో ఉన్న స్వధార కేంద్రంలో మంచి రక్షణ కల్పించామాని , బోధన్ పోలీస్ స్టేషన్ నుంచి స్వరూప మరియు సుజాత వచ్చి ఎఫ్ ఐ ఆర్ రాసుకున్నారని, శుక్రవారం సి డబ్ల్యూ సి,నిజామాబాద్ తీసుకుని వెళ్తారని తెలిపారు .