Listen to this article

మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తున్న విబిఎన్ ఫౌండేషన్ సేవలు

అవసర సమయంలో ఆదుకున్న దాసరి నినన్  సేవాభావం

జనం న్యూస్ – జనవరి23- నాగార్జునసాగర్ టౌన్ –

నందికొండ మున్సిపాలిటీ నాలుగవ వార్డుకు చెందిన పి. రమేష్ సతీమణి పి. రాజేశ్వరి ఇటీవల కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న విబిఎన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ దాసరి నినన్ గురువారం ఆమెకు ఆర్థిక సహాయం అందించారు.అవసర సమయంలో చేయూత అందించడం సమాజ బాధ్యత అని ఈ సందర్భంగా దాసరి నినన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చుక్క నిర్మల , వల్లెపు నాగార్జున మర్రి నరేందర్ పాల్గొని బాధిత కుటుంబానికి తమ మద్దతు తెలిపారు.ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత మందికి ఆదర్శంగా నిలవాలని స్థానికులు అభిప్రాయపడ్డారు.