Listen to this article

జనం న్యూస్ – జనవరి 23- నాగార్జునసాగర్ టౌన్ –

అంతర్జాతీయ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ ను శుక్రవారం కేంద్ర అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల బృందం సందర్శించారు. ఢిల్లీకి చెందిన ఇనిస్ట్యూట్ ఆఫ్ సెక్రటేరియట్ ట్రైనింగ్ అండ్ మేనేజ్మెంట్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లుగా(గ్రూప్ 2) నియమితులై శిక్షణ పొందుతున్న వారు తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో వారం రోజులుగా శిక్షణ పొందుతున్నారు. వీరు భారత్ దర్శన్ లో భాగంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్టేరియట్ ట్రైనింగ్ అండ్ మేనేజ్మెంట్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ భగవాన్ ఆధ్వర్యంలో 70 మంది సెక్షన్ ఆఫీసర్లు నాగార్జునసాగర్ ను సందర్శించారు. సాగర్ సందర్శనలో భాగంగా నాగార్జునసాగర్ ప్రధాన డ్యామ్ ను, బుద్ధవనాన్ని సందర్శించారు. వీరికి స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ నాగార్జునసాగర్ ప్రాజెక్టు, నాగార్జున కొండ చారిత్రక వివరాలు, బుద్ధవనం విశేషాలను వివరించారు.బుద్ధ వనములోని సమావేశ మందిరంలో బుద్దవనం విశేషాలు తెలిపే లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్రలు బౌద్ధం గురించి ఆచార్య నాగార్జున గురించి తెలియచేశారు. వీరితోపాటు సాగర్ సిఐ శ్రీను నాయక్, ప్రోటోకాల్ ఆర్ఐ దండ శ్రీనివాస్ రెడ్డి, సెక్షన్ ఆఫీసర్ల కోఆర్డినేటర్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.