కిడ్నీ వ్యాధిగ్రస్తుడు ఖాదీర్ కు ఆర్థిక సహాయం అందించిన- నినన్ దాసరి
జనం న్యూస్ – జనవరి 23- నాగార్జునసాగర్ టౌన్-
నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ మసీదు మౌలా సాబ్ కుమారుడు ఖాదీర్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతు కుటుంబ పోషణ భారమై ఇబ్బంది పడుతున్న విషయం పైలాన్ కాలనీకి చెందిన ఓబిసి నాయకులు జంగయ్య ద్వారా తెలుసుకుని ఖాదీర్ అమ్మగారైన నజీమా కు ఆర్థిక సహాయం అందించిన విబిఎన్ ఫౌండేషన్ వ్యవస్థాపక డైరెక్టర్ దాసరి నినన్.ఈ సందర్భంగా విబిఎన్ ఫౌండేషన్ డైరెక్టర్ నూకల చెన్నారెడ్డి మాట్లాడుతూ ఆపదలో ఉన్న కుటుంబాలకు సహాయం అందించడంలో తమ సంస్థ ఎల్లప్పుడూ ముందు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చుక్క నిర్మలా జానీ, మద్దాల భాను, జంగయ్య, నాగార్జున, జనార్ధన్, రాకం సైలేందర్ (చిట్టి) లు పాల్గొన్నారు.


