Listen to this article

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా జనవరి 23,

నందలూరుమండలంలోని కుంపినీపురం లో వెలసిన శ్రీ భోగాంజనేయ స్వామి దేవస్థానం నందు ఈనెల 25వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఉత్సవాలు అతి వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపారు, ఈ ఉత్సవాలకు మన రాష్ట్రం నుంచే కాక కర్ణాటక ఇతర జిల్లాల నుంచి భక్తులు రానున్నారు జాగిర్దారుల ఆరాధ్య దైవమైన కుంపిణీపురం భోగా ఆంజనేయ స్వామి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు 25వ తేదీన రథసప్తమి నాడు ఉదయం ఉపనయనం, ఆస్థాన పూజలు, పంచామృతాభిషేకం, స్వామివారికి ఆకు పూజ, 26న భీష్మాష్టమి నాడు ఉదయం స్వామి వారికి ప్రభాత సేవ, పంచామృతాభిషేకం ,ఆకు పూజ రాత్రి 9 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, 27న ఉదయం ముగ్గుల పోటీలు, మధ్యాహ్నం కలశపూజ అనంతరం స్వామివారి రథోత్సవ కార్యక్రమం నిర్వ హించనున్నారు, బండలాగుడు పోటీలు, 26వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12గంటలకు బండలాగుడు పోటీలు ఈ పోటీలకు పలు ప్రాంతాల నుంచి ఎద్దులు రానున్నాయి గెలుపొందిన వారికి మొదటి బహుమతి కింద 60,000 రూపాయలు ద్వితీయ బహుమతి 50,000 తృతీయ బహుమతి 40,000 నాలుగో బహుమతి 30,000 5వ బహుమతి 20,000 ఆరో బహుమతి 10,000 పోటీలలో పాల్గొన్న ప్రతికాడెద్దులకు 5000 రూపాయలు విలువచేసే కన్సోలేషన్ బహుమతి అందజేస్తున్నట్లు కార్యనిర్వాహకు లు సాయి ఆనంద్, కోనేటి నారాయణ,చింతకాయల నరసింహులు తెలిపారు, ఆలయ విశిష్ట గురించి అర్చకులు మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా దక్షిణ ముఖ ఆంజనేయ స్వామి ఆలయంకుంపిణీపురంలో ఉంది ఆవకాయ జాడీలో స్వామివారు ఆవిర్భవించడం విశేషం దక్షిణముకంగా ఆలయాలు ఉంటాయి కానీ స్వయంభుగా వెలసిన స్వామి వారు లేరు ప్రతి ఏడాది రథసప్తమి రోజున వరాహఆంజనేయస్వామి కుంపిణీపురం ఆంజనేయ స్వామిని భక్తులు కొలుస్తుంటారు ఆలయ అర్చకులు సహపురం రఘు నాదాచార్యులు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు,