జనం న్యూస్ జనవరి 23 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం వసంత పంచమి పురస్కరించుకొని చిలిపిచేడ్ మండల పరిధిలోని జగ్గంపేట గ్రామం లో అంగన్ వాడి కేంద్రం లో నూతనంగా(ఆరోగ్యలక్ష్మి ) కమిటీ ఎంపిక చేశారు ఈ రోజు స్థానిక సర్పంచ్ శ్రీమతి జానమొల్ల స్రవంతి రాందాస్ గౌడ్ వసంత పంచమి పురస్కరించుకొని పిల్లలతో అక్షరాబ్యాసం చేయించారు మండల ఐ సి డి యస్ సూపర్ వైజర్ సంతోషిమాత మాట్లాడుతు 0-5సo “ల పిల్లలబరువు తీయుట పోషకహర లోపం లేకుండ చూడాలని, గర్భిణీ, బాలింతలు తీసుకోవాల్సిన పోషకారాల గురించి, గ్రామం లో బాల్యవివాహాల జరుపకూడదని అమ్మాయి కి 18సంవత్సరాలు అబ్బాయికి 21సంత్సరాలు నిండిన తర్వాత పెళ్ళి చేయాలని తెలియచేశారు అనంతరం నూతన సర్పంచ్ శ్రీమతి జానమొల్ల స్రవంతి గారికి శాలువాతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్ షహనాజ్ బేగం, ఆశవర్కర్ అనిత, ఆయా దుర్గమ్మ, తల్లులు పాల్గొన్నారు


