Listen to this article

జనం న్యూస్ జనవరి 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని మూసాపేటలో ఈనెల 25వ తేదీన ఓం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు అంబటి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
అమోర్ ఆసుపత్రి, ఆరాధ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ వైద్య శిబిరం మున్సిపల్ సర్కిల్ కార్యాలయం సమీపంలో ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించబడుతుందని ఆయన పేర్కొన్నారు.ఈ శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలతో పాటు ఈసీజీ, కంటి, దంత వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే అనుభవజ్ఞులైన జనరల్ ఫిజీషియన్ డాక్టర్లు ప్రజలకు వైద్య సేవలు అందించనున్నారని వివరించారు.ఈ అవకాశాన్ని మూసాపేటతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అంబటి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.