కాట్రేనికోన జనవరి : కాట్రేనికోన పంచాయితీ పరిధిలోని వేట్ల పాలెం,బూలవారిపేట, జిల్లెల్లవారి పేట, అడవిపేట గ్రామాలకు చెందిన స్మశాన వాటికలో తుప్పల తొలగించే పనులు సర్పంచ్ గంటి వెంకట సుధాకర్ ఆధ్వర్యంలో ముమ్మరంగా చేస్తున్నారు. నాలుగు గ్రామాలకు చెందిన ప్రజలు వాడుకునే ఈ స్మశాన వాటిక ను ఆయా గ్రామాల ప్రజల విజ్ఞప్తి మేరకు పనులు చేస్తున్నట్లుసర్పంచ్ తెలిపారు. అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారు దీనిని ఉపయోగించు కోవడం జరుగుతుంది సుమారు 20 సంవత్సరాలనుండి ఈ స్మశాన వాటిక అభివృద్ధికి నోచుకోక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆయా గ్రామాల పెద్దలు, ప్రజలు సర్పంచ్ సుధాకర్ ద్రుష్టి కి తీసుకు రావడం తో అయన ఆదేశాలు మేరకు సెక్రటరీ జే వి వి సత్యనారాయణ పర్యవేక్షణ లో జే సి బి సాయం తో పనులు చేస్తున్నారు. ఇప్పటికే ఓల్డ్ అయినా పురం డ్రైన్ గట్టున ఉన్న బి సి, ఎస్సీ స్మశాన వాటిక, రామస్వామి తోట స్మశాన వాటికలను కొంత వరకూ అభివృద్ధి చేశారు. ప్రస్తుతం వేట్ల పాలెం సమీపంలో ఉన్న స్మశాన వాటిక పనులు ముమ్మరం గా చేస్తున్నారు.పంచాయతీ పరిధిలో ఉన్న అన్ని స్మశాన వాటికలను స్థానిక అవసరాలు మేరకు అన్నింటిని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు



