జనం న్యూస్ 24 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
స్టీరింగ్ పడితే ప్రయాణికుల క్షేమమే వారి ఊపిరి.. గమ్యం చేరే వరకు అలుపెరగని నిరంతర కృషి వారిది. ఓ వైపు పని ఒత్తిడి.. మరో వైపు మనసులో కుటుంబం గురించి చింత ఉన్నా.. రోడ్డుపై మాత్రం అత్యంత ఏకాగ్రతతో వాహనాన్ని నడుపుతూ ‘సురక్షిత ప్రయాణానికి’ వారు చిరునామాగా నిలుస్తున్నారు. వారే ఆర్టీసీ డ్రైవర్లు. మన విజయనగరం జిల్లాలో 300 వరకు బస్ డ్రైవర్లు ఉన్నారు. నేడు డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా వారికి సెల్యూట్!


