జనం న్యూస్ జనవరి 24 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు అంగన్వాడి కేంద్రంలో భేటీ దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ జితేందర్ మరియు గ్రామ సర్పంచ్ టం టం శేషాద్రి మరియు గ్రామ ఉపసర్పంచ్ మన్నె వెంకటేశం గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఒక్కరూ తమ చిన్నారులకు అంగన్వాడి కేంద్రానికి పంపించాలని అన్నారు చిన్నారులకు అంగన్వాడి కేంద్రానికి పంపించడంతో విద్యతోపాటు శారీరక మానసిక దృఢత్వం పెరుగుతుందని అన్నారు గర్భిణీలు బాలింతలు అంగన్వాడి కేంద్రంలో అందించే పౌష్టిక ఆహారాన్ని స్వీకరించాలని తెలియజేశారు అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే సలహాలు సూచనలు పాటించాలని అన్నారు ఈ కార్యక్రమంలో గర్భిణీలు బాలింతలు చిన్నారులు మరియు అంగన్వాడీ టీచర్స్ శశికళ యాదమ్మ అంగన్వాడి హెల్పర్స్ లక్ష్మి బాలమ్మ మరియు ఆశా వర్కర్ యాదమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బాలిక దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా చిన్నారులను గ్రామ సర్పంచ్ తొట్టెలలో వేసి చిన్నారులను అలరించారు చిన్నపిల్లలకు పౌష్టికాహారం తోనే పిల్లలు దృఢంగా ఉంటారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో చిన్నారులు పిల్లల యొక్క తల్లులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు


