Listen to this article

జనం న్యూస్ – జనవరి 24- నాగార్జునసాగర్ టౌన్ –

ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి ప్రజల సిద్ధం కావాలని సిపిఎం పార్టీ పెద్దవూర మండల కార్యదర్శి దుబ్బ రామచంద్రయ్య పిలుపునిచ్చారు నాగార్జునసాగర్ హిలకాలనీ సిపిఎం పార్టీ శాఖ సమావేశ సందర్భంగ ఆయన మాట్లాడుతూ కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లు చేసి కార్మికుల హక్కులను కాల రాసిందన్నారు అదేవిధంగా జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చి అదేవిధంగా ఈ చట్టం యొక్క పేరు మార్చి వ్యవసాయ కార్మికుల జీవితాలను అంధకారం చేసిందని రైతులకు సంబంధించి విత్తన బిల్లును అదే విధంగా విద్యుత్ బిల్లును తీసుకొచ్చి రైతుల నడ్డి విరిచిందనన్నారు కావున కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు ప్రజలు పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాల్లో పాల్గొవాలని ఈ చట్టాల విషయంలో బిజెపి పార్టీ వెనక్కు తగ్గే వరకు పోరాటం నిర్వహించాలని అన్నారు స్థానిక నందికొండ మున్సిపాలిటీలో జరిగే ఎలక్షన్లో సిపిఎం పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి ప్రజలను గెలిపించాలని కోరినారు ఈ యొక్క సమావేశం చుక్క రమేష్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ప్రజాసంఘాల నాయకులు మురుగన్ కృష్ణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.