Listen to this article

జనం న్యూస్ జనవరి 24, వికారాబాద్ జిల్లా, పరిగి నియోజకవర్గంలోని,

పూడూరు మండలం లో గల ఎంకెపల్లి గ్రామం లో మోడల్ స్కూల్ లో విద్యార్థులకు మట్టి నమూనా పరీక్షల ముఖ్య ఉద్దేశం మరియువాటి అవసరాన్ని అవగాహన కల్పించడం జరిగింది. ప్రధాన మంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ( పి ఎమ్ ఆర్ కె వి వై) పథకం లో భాగంగా పిల్లలకు విద్యార్థి దశలోనే వ్యవసాయం మరియు మట్టి పరీక్షల మీద అవగాహన కల్పించడానికి ఇట్టి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అని,మండల వ్యవసాయాధికారి శ్రీ తులసి రామ్ చెప్పారు. ఇందులో విస్తీర్ణ అధికారి శ్రీ సాయిరాం, మట్టి నమూనా నీ క్వార్టరింగ్ చేసి లాబ్ పంపించే విధంగా విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చారు.స్కూల్ ప్రధానోపధ్యాయురాలు శ్రీమతి సరళ , ఉపాధ్యాయులు శ్రీమతి మాధవి , శ్రీమతి మీను సింగ్, మరియు ఆరు నుండి తొమ్మిదవ తరగతి వరకు విద్యార్థులు పాల్గొన్నారు.