ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి
జనం న్యూస్ జనవరి 24 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా )
బీబీపేట మండల కేంద్రంలో డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణాల ద్వారా 14 మంది సభ్యులు ఒక్కొక్కరు 1.5 లక్షల రూపాయలతో కలిపి, 21 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసుకున్న క్షీర సాగరం డైరీ ఫామ్ గొర్ల పెంపకం 80 గొర్లు, మేకలు, 8 గేదెలు 2 ఆవుల ద్వారా పాల ఉత్పత్తి, ప్లోరి కల్చర్ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలను కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి, ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీబీపేట సర్పంచ్ ఏదుల్ల సాత్విక సాయినాథ్,శ్రీనిధి రాష్ట్ర కోశాధికారి సదాల స్రవంతి,పరిశోదక విద్యార్థి డా,సంతోష్ గౌడ్ ఐకేపీ డీపీఎం సురేష్ బాబు, ఏపీఎం శ్రీనివాస్, ఐకేపీ సీసీలు,కోనాపూర్ సర్పంచ్ చెప్యాల రాజేష్,ఉప్పసర్పంచ్ గరిగే శేఖర్,బీజేపీ నాయకులు పోసు శివ కుమార్, సూరు సురేష్, బట్టుపల్లి రంజిత్,బట్టుపల్లి రాములు,ఉప్పు నారాయణ, బట్టు భరత్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు


