Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 24 సెల్ 9550978955

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతీ నెలలో శనివారం విద్యార్థులందరికీ సృజనాత్మకతను పెంపొందించే విధంగా నో బ్యాక్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల పోలిరెడ్డి పాలెం నందు నో బ్యాక్ డే నిర్వహించడం జరిగింది మొదటి సెషన్ లొ భాగంగా బొమ్మలు గీయడం.రంగులు వేయడం బంక మట్టి తో ఆకారాలు తయారీ అలంకరణ.స్కిట్ మైమ్ చేయడం.తోటకు పోదాం కార్యక్రమం లో భాగంగా బడి తోటలో కలుపుతీయడం తరగతి గది పరిశుభ్రతగురించీ, చదువు కుందాం లో భాగంగా పాఠశాల లో ని గ్రంధాలయ పుస్తకాలు చదవడం కధలు చెప్పడం,చర్చించడం. పొడుపు కథలు చెప్పించడం, విందాం విందాం లో భాగంగా ఆరోగ్య భద్రత పై అవగాహన కల్పించడం లో భాగంగా చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని,పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలని అవగాహన కల్పించడం జరిగింది. ఈ రోజు కార్యక్రమం లో ఒరిగామి లో చిలుక తయారీ,పేపర్ ఇల్లు తయారీ. గ్రీటింగ్ కార్డ్స్ తయారీ విధానం గురించి. వివరించి చేయడం జరిగింది. అభినయ గేయాలు పాడించడంజరిగింది. తరగతి వారీగా పాఠ్యాంశాల్లో ని అభినయ గేయాలు పాడించడం జరిగింది.భాషకు 90నిమిషాలు. సృజనాత్మక కృత్యాలకు 90నిమిషాలు,ఆటలకి 90నిమిషాలు.దృశ్య శ్రవణ రూపంలో పాఠ్యాంశాల బోధనకు 90నిమిషాలు సమయం కేటాయించడం జరిగింది.విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహం గా పాల్గొన్నారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు జె హైమావతి ఉపాధ్యాయులు పోటు శ్రీనివాసరావు.జి ఆది లక్ష్మి, కే అరుణ సిహెచ్ నవ్య పాల్గొన్నారు.