జరం న్యూస్ జనవరి 24 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
ప్రసిద్ధి చెందిన అనకాపల్లి లో 171 సంవత్సరాల చరిత్ర కలిగిన వేల్పుల వీధి శ్రీ గౌరీ పరమేశ్వరి మహోత్సవం ఈరోజు ఘనంగా జరుగుచున్న శ్రీ గౌరీ పరమేశ్వరి అమ్మవారిని ప్రత్యేక పూజలు నిర్వహించారు,అమ్మవారిని ప్రత్యేక అలంకారం చేసి, రథంపై పట్టణ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. శ్రీ గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలను ప్రారంభించిన మాజీ మంత్రి, స్థానిక శాసన సభ్యులు కొణతాల రామకృష్ణ అమ్మవారి దర్శించుకుని రథం లాగి ప్రారంభించారు. భారీ లైటింగ్ సెట్టింగులు, స్టేజి ప్రోగ్రామ్స్, నేలవేషములు, చిటికెలు భజనలతో హోరెత్తిస్తున్న ఈ కార్యక్రమమునకు ఉత్తరాంధ్ర నుండి ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా అనకాపల్లి స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణతో పాటు రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ మౌలిక వసతులు కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, జనసేన నాయకుడు భీమర శెట్టి రామ్కి, రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ చైర్మన్ బత్తల తాతబాబు, రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్లసురేంద్ర, వర్తక సంఘం అధ్యక్షులు కొణతాల లక్ష్మీనారాయణ ( పెదబాబు) వివి రామమూర్తి, కార్పొరేటర్లు మందపాటి సునీత జానకిరామరాజు, జాజుల ప్రసన్నలక్ష్మి రమేష్,వీరిని ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా గౌరీ పరమేశ్వర మహోత్సవానికి ఎటువంటి సంఘటనలు జరగకుండా డీఎస్పీ శ్రావణి, పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ గరికి వెంకట్రావు సెక్రటరీ నానేపల్లి రవి, కోశాధికారి పోతల రమణ , ఉత్సవకమిటీ సభ్యులు వేల్పుల వీధి పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.//


