24/7 ప్రజాసేవ ప్రజల్లో ఉంటానని అన్నారు
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 24
తాను గత 30 సంవత్సరాలుగా విద్యా రంగంలో సేవలందిస్తూ వేలాది మంది విద్యార్థులకు పాఠాలు చెప్పి వారిని ఉన్నత స్థాయికి చేర్చానని, విద్య ద్వారానే సమాజ మార్పు సాధ్యమని నమ్ముతూ నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు. వార్డు అభివృద్ధి, విద్యా సౌకర్యాల విస్తరణ, యువతకు ఉపాధి అవకాశాలు, మౌలిక వసతుల మెరుగుదల లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో పాటు పార్టీ పెద్దలు అవకాశం ఇస్తే బాధ్యతాయుతంగా సేవ చేసి వార్డును ఆదర్శంగా నిలుపుతానని కృష్ణారెడ్డి అన్నారు.


