Listen to this article

జనం న్యూస్‌ 25 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

రాష్ట్రంలో అసలు పరిపాలన సాగుతుందా? లేక రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా నిద్రావస్థలో ఉందా? అని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ప్రశ్నించారు.ఈరోజు కొత్తవలసలోని మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చిన్న శ్రీను ఘాటుగా స్పందించారు.సమావేశంలో చిన్న శ్రీను మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా నాశనమైందని, అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. దీనికి నిదర్శనంగా శుక్రవారం ఎల్.కోట మండలంలో అధికార పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యేనే స్వయంగా భూ సమస్యపై ధర్నాకు దిగాల్సిన పరిస్థితి రావడాన్ని ఆయన ఉదాహరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యేనే యంత్రాంగం లెక్కచేయడం లేదంటే, వ్యవస్థలను ‘మూడో శక్తి’ ఎక్కడి నుంచో మానిటరింగ్ చేస్తోందని విమర్శించారు.ముఖ్య అంశాలు:బూటకపు హామీలు: పిజిఆర్ఎస్ (పి జి ఆర్ ఎస్) ద్వారా సమస్యలు పరిష్కరిస్తామన్న ప్రభుత్వ మాటలు అన్నీ అబద్ధాలని, అక్కడ వచ్చే సమస్యల్లో అత్యధికం రెవెన్యూ రంగానికి చెందినవేనని ఆయన ఎద్దేవా చేశారు.రీసర్వేపై మభ్యపెట్టడం: నాడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రైతుల క్షేమం కోసం కేంద్ర అనుమతితో పారదర్శకంగా రీసర్వే చేపట్టి పాసుపుస్తకాలు అందజేస్తే, కేవలం జగన్ ఫోటో ఉందన్న నెపంతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు. ప్రస్తుతం జరుగుతున్న రీసర్వే తీరుతో అధికారులు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.భూదందాలు: కూటమి నాయకులు వర్గాలుగా విడిపోయి, విలువైన భూములను కారుచౌకగా దోచేస్తున్నారని, అధికారులను బలిపశువులను చేసి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారని ఆరోపించారు.ప్రభుత్వానికి డిమాండ్:ఎల్.కోట ఘటనపై ప్రభుత్వం తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని చిన్న శ్రీను డిమాండ్ చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేనే రోడ్డుపై కూర్చోవడానికి గల కారణాలు, అందుకు బాధ్యులైన అధికారుల వివరాలను ప్రజలకు బహిరంగంగా తెలియజేయాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల క్షేమం కోరి రీసర్వేను పారదర్శకంగా చేపట్టాలని ఆయన హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో..వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి నెక్కల నాయుడు బాబు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గోరపల్లి శివ, విజయనగరం జిల్లా జనరల్ సెక్రెటరీ గొర్ల రవికుమార్, మండల పార్టీ అధ్యక్షులు ఒబ్బిన నాయుడు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.