Listen to this article

జనం న్యూస్‌ 25 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

రామభద్రపురంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. బొబ్బిలి మండలం కమ్మవలసకు చెందిన రాము రామభద్రపురం నుంచి బొబ్బిలి వైపు బైక్‌ పై వెళ్తుండగా.. రామభద్రపురం వైపు వస్తున్న బొలెరో చిన్నమ్మ తల్లి ఆలయం వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాము తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.