జనం న్యూస్ జనవరి 25 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
“జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్” అనే నినాదంతో నిర్వహించిన ధర్మ రక్షణ ఉద్యమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన హిందూ బంధువులతో కలిసి బస్సుల్లో ప్రయాణించి బాలాపూర్‌లో జరిగిన ధర్మ రక్షణ సభలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ, దేశ భద్రతకు, రాష్ట్ర శాంతి భద్రతలకు, హిందూ ధర్మ పరిరక్షణకు ముప్పుగా మారుతున్న అక్రమ చొరబాట్లపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. “గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం” ముఖ్యంగా భాగ్యనగరం వంటి సాంస్కృతికంగా, చారిత్రకంగా ప్రాధాన్యత కలిగిన నగరాన్ని అసాంఘిక శక్తుల నుండి కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు.అక్రమంగా దేశంలోకి చొరబడుతున్న శక్తులు సమాజ శాంతిని భంగపరుస్తూ, స్థానిక ప్రజల భద్రతకు ముప్పుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్” వంటి ఉద్యమాలు ప్రజల్లో చైతన్యం తీసుకువస్తాయని, హిందూ సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చే శక్తి ఇలాంటి ధర్మ రక్షణ సభలకు ఉందని అన్నారు.
బంగ్లాదేశ్‌కు చెందిన రోహింగ్యా అక్రమ చొరబాటుదారులను దేశం నుంచి పూర్తిగా తిరిగి పంపే వరకు నిరంతర పోరాటం కొనసాగాల్సిందేనని, భాగ్యనగరాన్ని రక్షించుకోవడం కోసం ప్రతి హిందువు ముందుకు రావాలని వడ్డేపల్లి రాజేశ్వరరావు పిలుపునిచ్చారు. ఇది కేవలం ఒక ఉద్యమం మాత్రమే కాకుండా, రాబోయే తరాల భద్రత, దేశ సమగ్రత కోసం చేపట్టిన బాధ్యతాయుతమైన పోరాటమని తెలిపారు.
ఈ ధర్మ రక్షణ సభలో కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



