జనం న్యూస్ జనవరి 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఫామ్ హౌస్ పై డ్రోన్ ఎగరేస్తే జైలులో పెట్టినవ్
మందకృష్ణ మాదిగ కోదండరామ్ ను జైలులో పెట్టినప్పుడు వ్యక్తిత్వ హననం గుర్తుకు రాలేదా.
విద్యా వ్యవస్థ పటిష్టత కోసమే ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అనంతరం మాట్లాడుతూ గత బి ఆర్ ఎస్ పాలనలో దేశభద్రత కోసం వాడాల్సిన ఫోన్ టాపింగ్ ను కెసిఆర్ కుటుంబం శాశ్వత అధికారం అక్రమాస్తుల సంపాదన కోసం వాడుకుందని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిన్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కెసిఆర్ కుటుంబం ఫోన్ టాపింగ్ ను అడ్డుపెట్టుకొని సినిమా ఇండస్ట్రీని కాంట్రాక్టర్లను బ్లాక్ మెయిల్ చేసి ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో కోట్లాది రూపాయలు సంపాదించుకుందని శాశ్వత అధికారం కోసం ఇతర రాజకీయ పార్టీల నాయకులను ఇబ్బందులకు గురి చేసిందన్నారు గత పాలనలో కేటీఆర్ ఫామ్ హౌస్ డ్రోన్ ఎగరేస్తేనే రేవంత్ రెడ్డి ని జైలులో పెట్టారని అదేవిధంగా మందకృష్ణ మాదిగ.. కోదండరాం ను జైల్లో పెట్టినప్పుడు లేని వ్యక్తిత్వ హననం ఇప్పుడు గుర్తుకొస్తుందా అని అన్నారు ఇప్పుడు మీ కుటుంబం గురించి బాధపడుతున్న మీరు అకారణంగా వారిని జైలులో పెట్టినప్పుడు వారి కుటుంబాలు గుర్తుకు రాలేద అని విమర్శించారు గురుకుల పాఠశాలలో గత ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు మెస్ కాస్మోటిక్ చార్జీలు 100% పెంచిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి దక్కుతుందన్నారు రాష్ట్రంలో విద్యావ్యవస్థను పటిష్టపరిచేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించి ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మిస్తుందన్నారు సింగరేణి నైని కోల్ బ్లాకు వ్యవహారంలో అవినీతి ఆరోపణలు వచ్చిన వెంటనే మీలాగా ఎదురు దాడి చేయకుండా అట్టి టెండర్లు రద్దుచేసి విచారణ జరిపిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు ప్రతిపక్ష పార్టీ నాయకునిగా ఉన్నప్పుడు గత టిఆర్ఎస్ ప్రభుత్వం నా ఫోన్ ట్యాప్ చేస్తుందని విమర్శించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ఫోన్ టాపింగ్ చేస్తే తప్పేంటి అని మాట్లాడడం ఆయన ద్వంద వైఖరికి నిదర్శనం అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు చిందం రవి ప్రపంచ రెడ్డి వరదరాజు రాజేందర్ కట్టయ్య రాజిరెడ్డి వీరన్న వలపదాసు రాము తదితరులు పాల్గొన్నారు….


