Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 07(నడిగూడెం)మండలం పరిధిలోని చాకిరాల గ్రామం వద్ద గల నాగార్జునసాగర్ ఎడమ కాలువలో బ్రిడ్జి వద్ద మహిళా మృతదేహం లభ్యమైనది. లభ్యమైన మృతదేహం నడిగూడెం మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు కీర్తిశేషులు యలక చక్రారెడ్డి భార్య నారాయణమ్మ గా స్థానికులు గుర్తించారు. ఆమె ప్రస్తుతం సూర్యాపేటలోని జమ్మిగడ్డ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.గత నాలుగు రోజుల క్రితం ఇంట్లో నుండి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయినదని తెలుసుకొని వారి కుమారుడు పాపిరెడ్డి సూర్యాపేట పట్టణ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.శుక్రవారంచాకిరాల బ్రిడ్జి వద్ద లభ్యమైన మృతదేహాన్ని వారి కుమారుడికి స్వాధీనపరచి పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై జి అజయ్ కుమార్ తెలిపారు.