జనం న్యూస్ జనవరి 26, వికారాబాద్ జిల్లా, పరిగి నియోజకవర్గం,
పరిగి పట్టణంలోని, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి నివాసంలో 77వ, గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి వారి ఇంటి వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి, నియోజకవర్గ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పరిగి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు, పరిగి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అంతిగారి సురేందర్, మాజీ ఎంపీపీ కరణం అరవింద్ రావు, మాజీ సింగల్ విండో డైరెక్టర్ భాస్కర్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, మీరు మహమ్మదు, సందీప్, హాజీ పటేల్, రఘువీర్, నరేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


