బిచ్కుంద జనవరి 26 జనం న్యూస్
భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవవందనం చేశారు.ఈ కార్యక్రమంలో చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ శంకర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మార్కెట్ కమిటీ సిబ్బంది కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు




