జనం న్యూస్ 26 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళా పోలీస్ స్టేషన్ నుంచి కలెక్టరేట్ వరకు ఓటర్ల అవగాహన ర్యాలీ జరిగింది. కార్యక్రమంలో ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సందేశాన్ని చదివి వినిపించి, ఓటు హక్కుపై ప్రతిజ్ఞ చేయించారు. ఆర్టీవో కీర్తి మాట్లాడుతూ…ఓటు ప్రజాస్వామ్యానికి వెన్నెముక అని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.


