

జేత్వాన్ బుద్ధ విహార్ లో రమాబాయి అంబేద్కర్ 127వ జయంతి వేడుకలు
జనం న్యూస్ పిబ్రవరి 07 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆర్టీఐ తిరుపతి : వాంకిడి మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార్ లో శుక్రవారండాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సతీమణి త్యాగశీలి రమాబాయి అంబేద్కర్ 127వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించరు ఈ సందర్భంగా భారతీయ బౌద్ద మహా సభ జిల్లా అధ్యక్షులు అశోక్ మహుల్కర్ మాట్లాడుతూ కటిక బీదరికంలో తన సంసారాన్ని ముందుకు లాగుతూనే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఉన్నత చదువుల కొరకు అహర్నిశలు కృషి చేసిందని అన్నారు. అంబేద్కర్ విదేశీ చదువులకు తన కుమారుడు చనిపోయిన చదువు కోసం ముందుకెళ్ళని డాక్టర్ బాబాసాహెబ్ కి ధైర్యాన్ని నింపిన త్యాగశీలి రమాయి అంబేద్కర్ అని పేర్కొన్నారు. ఒక దశలో అంబేద్కర్ లండన్ లో చదువుతున్నప్పుడు డబ్బుల కొరకు ఏర్పడితే పిడకలు అమ్మి, కూలి, చేసి ప్రోగు చేసిన డబ్బులను అంబేద్కర్ చదువు కోసం పంపించారని ఇలాంటి త్యాగమూర్తి నీ నేటి మహిళలందరూ ఆదర్శంగా తీసుకొని ఇండ్లలో తమ పిల్లల చదువు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి దుర్గం సునీల్, సమాజ్ క్రాంతి ఆగాడు జిల్లా అధ్యక్షులు దుర్గం తిరుపతి, సమాజాధ్యక్షులు విలాస్ కోబ్రా గడే, మహాత్మా రాజేంద్రప్రసాద్, పులే అంబేడ్కర్ బుద్ధభూమి ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు హిరీషన్ , బౌద్ధ,అంబేద్కర్ సంఘం నాయకులు దుర్గం సందీప్, ఉప్రే రోషన్, అరుణ్, ప్రసాద్, ప్రతాప్,రమేష్, రాజేశ్వర్, దుర్గం పెన్టు, బలవంత్, తదితరులు పాల్గొన్నారు.