Listen to this article

జనం న్యూస్ పిబ్రవరి 07 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో : కొమురం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పట్నాపూర్ గ్రామం శ్రీ పూలజీ బాబా సంస్థానంలో భక్తుల కొరకు నిర్మిస్తున్న మరుగుదొడ్లులను జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి పరిశీలించారు త్వరగతిన పూర్తి చేయాలని ఎంపీడీఓ కి సూచించారు ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల బాలికల యందు నీటి నీటికొరత ఎక్కువ ఉండడం వలన అక్కడ సందర్శించారు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కోరారు నీటి సమస్య త్వరలో ఐటీడీఏ నిధులతో పరిష్కారం చేస్తాం అని తెల్పారు పట్నపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో తనిఖీ చేశారు అక్కడ అంగన్వాడీ టీచర్ విద్యార్థుల వివరాలు నమోదు లేకపోవడంతో వెంటనే సిడిపిఓకు వివరాలు అందించాలి అని కోరారు అంగన్వాడీ కేంద్రంలో వచ్చే చిన్నారుల వివరాలు నమోదు చేయాలి గ్రామంలో నర్శరి లో మొక్కలను పరిశీలించారు అనంతరం పానపటర్ ఆశ్రమ పాఠశాల యాందు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు వారితో పాటూ ఐటీడీఏ ఏఈ ఇందల్ ఎంపీడీఓ సుధాకర్ రెడ్డి గ్రామ కార్యదర్శి అంజన్న పట్నాపూర్ యూత్ ఆద్యుక్షుడు ఆత్రం రాము ప్రధాన ఉపాద్యాయులు అరుణ రాజేంద్రప్రసాద్ తాజా మాజీ సర్పంచ్ బాలాజీ తదితరులు ఉన్నారు