జనం న్యూస్ ; 26జనవరి సోమవారం; సిద్ధిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ;
సిద్దిపేట పట్టణం శివాజీ నగర్ లోని బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు, ఈ ఈ సందర్భంలో సంస్థ నిర్వాహకురాలు బి కే భవాని మాట్లాడుతూ 1950 జనవరి 26న మన భారతదేశానికి రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన ఈరోజును మనము పండగల జరుపుకుంటామని, ఈ రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్క రూ స్వతంత్రంగా, స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని తెలిపే హక్కును పొందారు అని,భారతదేశం ప్రజాస్వామ్య రాజ్యం గా ఏర్పడిందని, దీనికోసం పాటుపడిన అంబేద్కర్ ఇంకా ఎందరో మహానీయుల మేధస్సు ద్వారా ఈ రాజ్యాంగాన్ని తయారు చేసి మనకు అందించారు, ఈ రాజ్యాంగం ద్వారానే మనమందరం కూడా ఇప్పుడు శాంతిగా , స్వేచ్ఛగా జీవిస్తున్నామని, మనమందరం చక్కని నియంత్రణలో నడిచినట్లయితే శాంతి వాతావరణం నెలకొంటుంది, ముఖ్యంగా గృహస్థంలో (ఇళ్లల్లో) శాంతి ఉంటే చుట్టుపక్కల సమాజంలో శాంతి వాతావరణ ఏర్పడుతుందని, భగవంతుని స్మృతి ద్వారానే మన మనసుకి సత్యమైన శాంతి లభిస్తుంది, అందరూ సుఖసంతోషాలతో గడపాలని మనకి పెద్దలు రాజ్యాంగాన్ని ఇచ్చారు మనం రాజ్యాంగబద్ధంగా నడుస్తూ సమాజానికి సమాజ శ్రేయస్సుకి పాటుపడాలని , మరియు సనాతన ధర్మం యొక్క నియమాలని ఆచరిస్తూ మనమందరం మన భారతీయ సంస్కృతికి పునర్ వైభవం తీసుకొచ్చి సనాతన ధర్మాన్ని రక్షిస్తూ, భారతదేశాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లి భారత దేశంను విశ్వ గురువుగా తయారు చేయడంలో మనమందరం ముఖ్యపాత్రను పోషించాలని తెలిపారు, అనంతరం సంస్థ నిర్వాహకురాలు రాజయోగిని బి కే భవాని,రిటైర్డ్ సర్వేయర్ కుందా మహేందర్, సురభి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్. సిహెచ్ ఉదయ్ కుమార్, మరియు సంస్థ సభ్యులందరితో కలిసి జాతీయ పతాకంను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి బీకే స్వప్న, సంస్థ సభ్యులు ఓంకార్ అమరేందర్ రెడ్డి,వెంకటేశం, జగదీష్ శర్మ, ఆంజనేయ చారి, కోటేశ్వర్ విమల, కరుణ, పద్మ, జలజ, తులసి, బిందు, భవానీ, రాధిక తదితరులు పాల్గొన్నారు


