జనం న్యూస్- జనవరి 26- నాగార్జునసాగర్ టౌన్-
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని ఇండియన్ ప్రిన్సెస్ స్కూల్ లో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన స్కూల్ ప్రిన్సిపాల్ జానీస్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన పాఠశాల డైరెక్టర్ రాయపూడి హృదయ రాజ్, ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ జానీస్ మాట్లాడుతూ 1950 జనవరి 26న మన భారతదేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని. భారత రాజ్యాంగం మనకు అందించిన హక్కులు, బాధ్యతలను విద్యార్థులకు వివరించారు, దేశ అభివృద్ధి సమైక్యత శాంతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని, విద్యార్థి దశ నుంచే దేశభక్తి, క్రమశిక్షణను అలవర్చుకోవాలని ఆయన అన్నారు. విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.


