Listen to this article

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 26 జనవరి

77 వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా తన కార్యాలయం వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు,ఈ కార్యక్రమంలో వై.నరోత్తం మాట్లాడుతు ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగం వల్ల మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని,దేశానికి స్వాతంత్రమెంత అవసరమో ప్రజలు స్వేచ్ఛగా బ్రతకడానికి రాజ్యాంగం ఒక వరం లాంటిదని సార్వసత్తాక సామ్యవాద లౌకిక గణతంత్ర రాజ్యంగం ఆవిర్భవించి నేటికీ సరిగ్గా 76 ఏళ్ళు పూర్తి చేసుకొని 77 వ వసంతం లోకి అడుగు పెడుతున్నామని ప్రజలకు 77 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు.పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి అంటే అది రాజ్యాంగం మనకు కల్పిచిన హక్కు అని అన్నారు. ప్రతి ఒక్కరు రాజ్యాంగం రచించిన పెద్దలను గుర్తు చేసుకోని వారి స్పూర్తితో ముందుకు సాగాలని కోరడం జరిగినది.ఈ కార్యక్రమంలు నాయకులు డి.మాణిక్ ప్రభు గౌడ్,యస్. గోపాల్,చెంగల్ జైపాల్,యస్. శ్రీనివాస్,బి.విఠల్,పెంటన్న,గఫార్,బి.దిలీప్,ముబీన్,గోపాల్,సుధాకర్ రెడ్డి,నవీన్,కిరణ్, క్రిష్ణ,శ్రీనివాస్,రాజు,సుధాకర్,సుభాష్,మోహన్,లక్ష్మి,సుహాశిని,తదితరులు పాల్గొన్నారు.