జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 26 సెల్ 9550978955
నరసరావుపేట జనవరి 26 77 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో
జిల్లా ఎస్పీ B.కృష్ణారావు ఐపీఎస్.జాతీయ పతాకావిష్కరణ చేసి సిబ్బందికి గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జనవరి 26 న భారతదేశ వ్యాప్తంగా 77 వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకొంటున్నామని తెలిపారు. స్వాతంత్ర్యం పొందిన అనంతరం భారతదేశంలో పరిపాలన కొరకు అత్యంత ఆవశ్యకత కలిగిన తన సొంత రాజ్యాంగం అమలు చేయాలని నిర్ణయించుకుని, రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారన్నారు.రాజ్యాంగ ముసాయిదా కమిటీ రూపొందించిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చిందన్నారు. అప్పటి నుంచి దేశం ప్రజాతంత్ర పరిపాలన కలిగిన సంపూర్ణ గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిందన్నారు అనంతరం పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి ఎస్పీ మిఠాయిలు పంచిపెట్టారు.ఈ కార్యక్రమంలో ఎస్పీతో అదనపు ఎస్పి( అడ్మిన్) JV సంతోష్ ఏఆర్ అదనపు ఎస్పి V. సత్తి రాజు ఏ.ఆర్ డీఎస్పీ గాంధీ రెడ్డి RI లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.


