Listen to this article

జనం న్యూస్ // ఫిబ్రవరి 7 // జమ్మికుంట // కుమార్ యాదవ్..జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామ లో ,ఇల్లందకుంట గ్రామానికి చెందిన పెద్ది భాస్కర్ అనే వ్యక్తి ట్రాక్టర్ ని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.పెద్దపల్లిలో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ తిరిగి స్వగ్రామమైన ఇల్లంతకుంటకు వస్తుండగా మార్గమధ్యంలో కోరపల్లి గ్రామంలో ఆగి ఉన్న ట్రాక్టర్ను వెనుక నుండి బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య తో పాటు నాలుగు సంవత్సరాల కుమార్తె ఉన్నారు. భాస్కర్ మృతితో ఇల్లందకుంట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.