

జనం న్యూస్ ఫిబ్రవరి 07(నడిగూడెం) వేసవికాలంలో గ్రామాల్లో ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కోదాడ సబ్ డివిజన్ డిఈఈ దేవ బిక్షం,గ్రిడ్ డిఈ అభినయ్ తెలిపారు.శుక్రవారం మండలంలోని వేణుగోపాలపురం, చెన్నకేశవపురం,కరివిరాల, వెంకట్రామపురం, కాగిత రామచంద్రపురం గ్రామాలలో మిషన్ భగీరథ ట్యాంక్ లను,మంచినీటి బోర్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ విజయలక్ష్మి,ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఇర్పాన్,ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శిలు విజయలక్ష్మి,అన్వర్, అనిల్,మిషన్ భగీరథ సిబ్బంది వెంకన్న, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.