

పెద్ద ఎత్తున పాల్గొన్న కృష్ణాలయం భక్తులు
–చేసుకున్న సేవే శాశ్వతం: రామకోటి రామరాజు
జనం న్యూస్ ఫిబ్రవరి 7, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) లోకశాంతి కొరకు గ్రామ, గ్రామాన నిర్వహిస్తున్న రామ,శివ లిఖిత మహాయజ్ఞం శుక్రవారం నాడు శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ ఆధ్వర్యంలో కృష్ణాలయంలోని రామాలయం వద్ద 2గంటల పాటు రామనామ స్మరణ మధ్య రామ,శివ నామాలను లిఖించారు. అనంతరం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు దేవాలయంలోనే అందజేశారు. అనంతరం అయన మాట్లాడుతూ శృంగేరి పీఠం రామకోటి సంస్థ ద్వారా కోట్లాది లిఖిత సంఖ్యను త్వరలో అందజెస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు యెలగందుల రాంచంద్రం, కోశాధికారి దూబకుంట మెట్రాములు, సెక్రెటరీ ఉప్పల వెంకటేశం, అత్తెల్లి లక్ష్మయ్య, అంతునూరి శివకుమార్, దార రాంచంద్రం, బండి శ్రీను, చకిలం చిరంజీవి, ఉప్పల మధు తదితరులు పాల్గొన్నారు.