జనం న్యూస్ 27 జనవరి వికారాబాద్ జిల్లా
పూడూరు మండలం గట్టుపల్లి గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ జెండాను సర్పంచ్ పద్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. 1950 జనవరి 26న మన భారతదేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును పురస్కరించుకుని ప్రతి సంవత్సరం 26 జనవరి న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పద్మా-రాజు, విలేజ్ సెక్రటరీ అబ్దుల్లా, అంగన్వాడి టీచర్ మనీల, ఆశ వర్కర్ మంజుల, విద్యార్థిని విద్యార్థులు గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు మహిళలు యువకులు పాల్గొన్నారు.


