జనం న్యూస్, జనవరి 27 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్: శ్రీనివాస్ రెడ్డి
అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్ నగర్‌లో శివ స్వాముల మహా పడిపూజ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. గవిరెడ్డి గురుస్వామి ఆహ్వానం మేరకు ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన 20వ మహా పడిపూజ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు, టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించగా, అనంతరం భక్తుల కోసం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సత్యం శ్రీరంగం మాట్లాడుతూ, శివ స్వాముల మహా పడిపూజ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, ఐక్యత, భక్తిభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.ఈ మహోత్సవంలో సుంకన్న, సురేందర్, పలువురు శివ స్వాములు, స్థానికి కాలనీవాసులు, భక్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తుల గోవింద నామస్మరణతో పర్వత్ నగర్ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో ఉట్టిపడింది.



