Listen to this article

(జనం న్యూస్ చంటి)

ఈ సందర్భంగా గ్రామంలోని విద్యార్థులకు వాసుదేవా రెడ్డి వారి ఆధ్వర్యంలో పరీక్షా ప్యాడ్స్‌ను పంపిణీ చేశారు. బిజెపి సోషల్ మీడియా కన్వీనర్ బండి రాజు తైల కుమార్ తోడంగి రాజు విద్యార్థులకు పెన్నులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు ఆటపాటలతో ఉత్సాహంగా పాల్గొని వేడుకలను మరింత సందడిగా మార్చారు. చిన్నారుల క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
విద్యార్థుల చదువుకు అవసరమైన సామగ్రిని అందించడం అభినందనీయమని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం యువతకు స్ఫూర్తిదాయకమని వారు అభిప్రాయపడ్డారు.