Listen to this article

జనం న్యూస్ జనవరి 27 చిలిపి చెడు మండల ప్రతినిధి

మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి చండూరు గ్రామంలో వివిధ సంఘాలలో జెండాలు ఎగురవేశారు తదనంతరం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ జెండా వందనం ఎగరవేశారు
తదనంతరం హై స్కూల్ లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ సర్కార్బడుల్లో నాణ్యమైన విద్య ఉంటుంది కాబట్టి ప్రతి పిల్లవాడు గవర్నమెంట్ పాఠశాలలో చదువుకోవాలని తెలియజేశారు ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అందుతుందని చెప్పారు హై స్కూల్లో మంచి విద్యావంతులైన టీచర్లు ఉన్నారు కాబట్టి విద్యార్థుల్లో మంచి ప్రతిభను కనపరచాలని విద్యార్థులకు సూచించారు మనదేశంలో కుల మతాలకు అతీతంగా అందరూ జరుపుకునే పండగ ఈ గణతంత్ర దినోత్సవ కార్యక్రమం ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగ పొలం వారి సుదీర్ఘ పోరాటం ద్వారా వచ్చిన స్వాతంత్ర ఫలాలను పరిపాలనలో అమలు చేయాల్సిన బాధ్యతలు విధులను తెలిపే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు దిశా నిర్దేశం చేయడానికి రచించిన రాజ్యాంగం అత్యంత విలువైనది ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగం మూలం మన దేశం భిన్నత్వంలో ఏకత్వం కలది వివిధ వర్గాల వారు వారి విశ్వాసాలకు అనుగుణంగా భగవద్గీత ఖురాన్ బైబిల్ ను గౌరవిస్తారు కానీ దేశంలోని అన్ని వర్గాల ప్రజలు గౌరవించేది దేశ రాజ్యాంగాన్ని దేశాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి అందరూ కృషి చేయాలి అని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శేషాద్రి ఉపసర్పంచ్ మన్నె వెంకటేశం వార్డు సభ్యులు ప్రధానోపాధ్యాయుడు రమేష్ మరియు ఇతర ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థిని విద్యార్థి యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు హైస్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థిని యొక్క తల్లిదండ్రులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు