

జనం న్యూస్ 08 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం పట్టణం 3వ డివిజన్ ఫూల్ బాగ్ వైసీపీకి చెందిన 50 కుటుంబాలు శుక్రవారం టీడీపీలోకి చేరారు. ట్రేడ్ యూనియన్ నాయకులు రాయితీ లక్ష్మణరావు, గండ్రేటి సన్యాసిరావు ఆధ్వర్యంలో 50 కుటుంబాలు టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాకు చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. వైసీపీ విధివిధానలు నచ్చకపోడంతో ఆ పార్టీని వీడినట్లు వారు తెలిపారు.