జనం న్యూస్ 28 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
ఉద్యోగుల సమ్మె కారణంగా నిన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలు నిలిచిపోయాయి. వారంలో 5 రోజుల పని దినాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బ్యాంక్ యూనియన్ల సంయుక్త వేదిక (యూ ఎఫ్ బీ యు) ఆధ్వర్యంలో బ్యాంక్ ఉద్యోగులు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టారు.
జిల్లాలో 10కి పైగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, 250 పైగా శాఖలు విస్తరించి ఉన్నాయి. సమ్మె కారణంగా నిన్న రూ. 500 కోట్లకు పైగా ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయి.


