Listen to this article

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.
జనం న్యూస్ 08 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్వి జయనగరం జిల్లా పోలీసుశాఖలో హెూంగార్డుగా పని చేసి, ఇటీవల మరణించిన హెూంగార్డు కుటుంబానికి“చేయూత”ను అందించేందుకు హెూంగార్డు సిబ్బంది సమకూర్చిన ఒక్క రోజు డ్యూటీ అలవెన్సు చెక్ ను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ ఫిబ్రవరి 7న జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేసారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ – పోలీసుశాఖలో పని చేస్తూ ప్రమాదవసాత్తులేదా ఆకస్మికంగా లేదా అనారోగ్యంతో మరణించిన హెూంగార్డు కుటుంబాలు అర్ధంతరంగా తమ కుటుంబంలో వ్యక్తినికోల్పోయి, ఆర్ధికంగా నష్టపోయిన సమయంలో వారి కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకొనేందుకు హెూంగార్డ్సు స్వచ్చందంగా ముందుకు వచ్చి, ఒక్క రోజు డ్యూటీ అలవెన్సు మొత్తాన్ని ప్రోగు చేసి, వారి కుటుంబాలకు “చేయూత”గాఅందజేయడం అభినందనీయమన్నారు. ఈ తరహా చర్యలు చేపట్టడం వలన పోలీసు ఉద్యోగుల్లో ఐకమత్యం పెరగడంతోపాటు, వారి కుటుంబాలకు అండగా ఉన్నామన్న భరోసా లభిస్తుందని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు.విజయనగరం జిల్లాలో హెూంగార్డుగా ఎంపికై, స్టీలు ప్లాంట్ లో పని చేస్తున్న బి.జగదీశ్వర రావు అనారోగ్య కారణాలతో డిసెంబరు 13న మరణించగా, వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకొనేందుకు ‘చేయూత’గా హెూంగార్డ్సు సమకూర్చిన ఒక్క రోజు డ్యూటీ అలవెన్సు రూ.3,25,890/- ల చెక్ ను వారి తల్లి అయిన బి.హైమావతి గార్కి జిల్లా ఎస్పీ పోలీసు కార్యాలయంలో అందజేసారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి హెూంగార్డుగా నియమించేందుకు,కుటుంబ సంక్షేమానికి కృషి చేస్తామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు.ఈ కార్యక్రమంలో హెూంగార్డ్సు ఇన్చార్జ్ ఆర్ఐ ఆర్.రమేష్ కుమార్, డిపిఓ సూపరింటెండెంట్ ఎ.ఎస్.వి.ప్రభాకర రావు మరియు పోలీసు కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.