జనం న్యూస్ 28 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విశాఖపట్నం నడిబొడ్డున ఉన్న సుమారు రూ. 5,000 కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ చేసే పేరుతో గీతం విద్యా సంస్థకు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ఈ నెల 30న జరిగే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై తీర్మానం చేసేందుకు సిద్ధమవ్వడం దుర్మార్గం.
దీనిని అడ్డుకోవడానికి ఈరోజు మేఘాలయ హోటల్‌లో వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, రీజనల్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరియు ఇతర ముఖ్య నేతలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
విశాఖ భూములను కాపాడుకోవడానికి ఎంతటి పోరాటానికైనా సిద్ధం


