Listen to this article

జనంన్యూస్. 28.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.

నిజామాబాదు రురల్ సిరికొండ మండలం లొని న్యావనంది గ్రామం అటవీ భూమి ఆక్రమణకు గురికాకుండా కాపాడాలని ఐదు సంవత్సరాల నుంచి గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో RFO ,DFO కు పలుమార్లు వినతులు సమర్పించిన గ్రామస్తులు అటవీ భూమిని గత పది పదిహేను సంవత్సరాల నుంచి కొందరు ఆక్రమించుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు మరియు ప్రతి సంవత్సరం స్థానిక అటవీ శాఖ అధికారుల తో కుమ్మక్కై కొందరు రైతులు చెట్లు నరుకుతూ అటవీ భూమి అభివృద్ధి చేసుకొని పంట పండించుకుంటున్నారని తెలుసుకొని రెవెన్యూ ఫారెస్ట్ జాయింట్ సర్వే నిర్వహించి హద్దును గుర్తించి జెసిపి తో కందకం తవ్వాలని పలుమార్లు న్యవనంది గ్రామ ప్రజలు వీడీసీ ద్వారా వినతి పత్రాలు సమర్పించిన అధికారులు తూతూ మంత్రంగా కబ్జాదారులతో కుమ్మక్కై ఇ న్ని సంవత్సరాలుగా ఫారెస్ట్ గుర్తించలేదని పెద్దమనుషులు, గ్రామ నాయకులు వాపోయారు ఈసారైనా అధికారులు చట్ట ప్రకారం సర్వే చేసి హద్దులు గుర్తించాలని ఎమ్మెల్యే గారి సహకారంతో ఈరోజు జాయింట్ సర్వే నిర్వహించడం
జరిగింది అని ఏ లాంటి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగకుండా అధికారులు న్యాయంగా హద్దులు గుర్తించి అటవీ భూమి ఆక్రమణ తొలగించాలని మండలానికి వచ్చిన కొత్త రేంజ్ అధికారి గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నారు.