Listen to this article

జనం న్యూస్ జనవరి 28 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కీర్తిశేషులు దొడ్డి జగదీశ్వరరావు మొదటి వర్ధంతి కార్యక్రమం సాగి సుబ్బరాజు గారి వీధిలో వారి స్వగృహంలో జరిగిన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కొణతాల వెంకటరావు కాండ్రేగుల సత్యనారాయణ కాండ్రేగుల రవీంద్ర సరిసా నాగు దొడ్డి రమేష్ బుద్ధ భగవాన్ కోరిబిల్లి నూకరాజు కోరిబిల్లి మహాలక్ష్మి నాయుడు తదితరులు పాల్గొని దొడ్డి జగదీష్ చిత్రపటానికి పువ్వుల సమర్పించి ఘనమైన నివాళులర్పించారు. అతని పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ నిమిషం మౌనం పాటించాం. ఓం శాంతి. ఈ సందర్భంగా శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం మాజీ చైర్మన్ కొణతాల వెంకటరావు మాట్లాడుతూ దొడ్డి జగదీష్ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి మున్సిపల్ 16వ వార్డుకి దీర్ఘకాలం అధ్యక్షులుగా అనకాపల్లి జిల్లా టిఎన్టియుసి ఉపాధ్యక్షులుగా అంకిత భావంతో పనిచేసేవారని, ఏ పని అప్పగించిన బాధ్యతగా పనిచేసేవారని, పార్టీ సమావేశాలు ఉన్నప్పుడు కార్యకర్తలు అందరికీ సమాచారం ఇచ్చే వారిని అటువంటి వ్యక్తిని పార్టీ కోల్పోయిందని అతని సేవలు మరువలేమని వెంకటరావు అన్నారు.